![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -615 లో.... ప్రకాష్ దగ్గరికి సుభాష్ వస్తాడు. ఈరోజుతో ఇంట్లో నా విలువ తెలిసిందని బాధపడుతుంటే.. కావ్య ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కుంటాను.. నువ్వేం బాధపడకు కొంచెం టైమ్ ఇవ్వమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ దగ్గరికి కావ్య వస్తుంది. సారీ మావయ్య మీతో అలా మాట్లాడాల్సి ఉండకూడదని చెప్తుంది. నేను కంపెనీకి లాభం తెచ్చే పని చేసినా కూడా నువ్వు వద్దని అపావంటూ కఠినంగానే ప్రకాష్ మాట్లాడతాడు.
మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా మావయ్య అంటూ కావ్య బాధపడుతుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏం నటిస్తున్నావ్.. అందరి ముందు అలా మాట్లాడి ఇప్పుడిలా చెప్తున్నావా అంటు కావ్యపై కోప్పడుతుంది. మీరెందుకు రాను రాను ఇలా మాట్లాడుతున్నారు చిన్న అత్తయ్య అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఏడుస్తుంది. కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మొదటిసారి నీ కంట్లో కన్నీరు చూడడం ఇప్పుడు జరిగిందంతా చూసాను.. ఇదంతా ఎందుకు తాతయ్య మాట విషయం ఇంట్లో చెప్పేద్దామని రాజ్ అనగానే.. వద్దు ఈ విషయం తెలిస్తే ఆస్తుల కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కోర్ట్ కి వెళ్తారని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు ప్రకాష్ ని పూర్తిగా తన వైపుకి తిప్పుకోవాలనుకుంటారు. స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది రుద్రాణి. మరుసటి రోజు ఉదయం శాంత వచ్చి.. ఏం టిఫిన్ చెయ్యాలని రుద్రాణిని అడుగుతుంది.
నన్నెందుకు అడుగుతున్నావని రుద్రాణి అనగా.. ఇకనుండి ఇంట్లో అందరికి నచ్చినవి వండమని కావ్య మేడమ్ చెప్పిందని శాంత అంటుంది. నేను స్వప్నకి శ్రీమంతం చెయ్యాలనుకుంటున్నానని రుద్రాణి అనగానే.. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ అంటూ స్వప్న ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును చేద్దామనుకుంటున్నా ఒక ప్లాన్ కూడా వేసుకున్నానని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో శ్రీమంతానికి కావల్సిన లిస్ట్ రుద్రాణి రాస్తుంది. అది మొత్తం ఇరవై లక్షల ఖర్చు ఉంటుంది. అది రాసి కావ్యకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |